![]() |
![]() |

జస్వంత్ జెస్సీ.. బిగ్ బాస్ సీజన్-5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ లోకి జెస్సీ ఎంట్రీ ఇచ్చాక స్టేజ్ మీద నాగార్జున అతడిని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. అతడొక ఫ్యాషన్ డిజైనర్, ర్యాంప్ వాకర్ అని చెప్పాడు. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తుంటారని చెబుతూ స్టేజ్ పైనే ర్యాంప్ వాకింగ్ చేయించారు.
జెస్సీ అసలు పేరు జస్వంత్ పడాల. ఇతడు విజయవాడకు చెందిన వ్యక్తి. కానీ ఫ్యామిలీతో హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాడు. 29 ఏళ్ల జస్వంత్ కి మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీపై ఆసక్తి ఎక్కువ. నటించడమంటే మహా ఇష్టమట. అందుకే ముందుగా మోడలింగ్ లో ట్రైనింగ్ తీసుకొని.. బెంగుళూరులో చాలా ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాడు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్ గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేతగా నిలిచాడు. మోడలింగ్ ఇండస్ట్రీలో తప్పిస్తే జెస్సీ గురించి బయటివారికి పెద్దగా తెలియదు. అయితే 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ ను గెలుచుకోవడం లైమ్ లైట్ లోకి వచ్చాడు. మోడలింగ్ రంగంలో ఎదుగుతూ.. 36 గంటలు ర్యాంప్ వాక్ చేయించిన రికార్డ్ సంపాదించాడు. కేవలం ఫ్యాషన్ షోలు మాత్రమే కాకుండా.. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో 2017లో సప్తమాత్రిక అని ఓ టీవీ సీరియల్ లో నటించాడు. ఆ తరువాత 'ఎంతమంచి వాడవురా' సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్- 5తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
జెస్సీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తన గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. జెస్సీ చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయిన తనంతట తనే కష్టపడ్డాడు. వాళ్ల నాన్నకి బ్రెయిన్‌లో తేడా వచ్చి.. ఒక్కో పార్ట్ పడిపోయి మంచాన పడి చనిపోయారు. సరిగ్గా అదే టైమ్ లో జెస్సీ తన కెరియర్‌ని సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయాడు. సరిగ్గా వాడి కెరియర్ మొదలయ్యే టైమ్ లోనే ఇలా అయ్యింది. అప్పుడే డౌన్ అయ్యాడు. ఇన్నాళ్లకు మళ్లీ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ దొరికింది. ఇదే లైఫ్ అనుకుని వచ్చాడని అంది. ప్రేక్షకులు వాడికి సపోర్ట్ చేయాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడివరకు వచ్చాడని భావోద్వేగానికి గురయ్యింది జెస్సీ తల్లి. అయితే ఆ తర్వాత ఢీ షోలో కో డ్యాన్సర్ గా జాయిన్ అయ్యాడు. కానీ ఎప్పుడు ఫైనల్ కి రాలేదు. కానీ ఈ సీజన్ సెలెబ్రిటీ స్పెషల్ లో భాగంగా.. వెంకీ సినిమాలోని.. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దనే పాటకి నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఢీ షోలో జడ్జులుగా చేస్తున్న శేఖర్ మాస్టర్, ప్రణీత, గణేష్ మాస్టర్ కలిసి జెస్సీ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి ఫిధా అయ్యారు. ఈ పర్టికులర్ పర్ఫామెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని ప్రణీత అనగా,స్టేజా నేనా తేలిపోవాలనుకున్నావ్.. మస్త్ అనిపించింది.. మనిషి అంటే నీలా ఉండాలని గణేష్ మాస్టర్ చెప్పడంతో జెస్సీ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. జెస్సీ కెరీర్‌లో ఈ పర్ఫామెన్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
![]() |
![]() |